లేడీస్ అండ్ జెంటిల్ మాన్ షో అందంగా ముస్తాబై ఆదివారం రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రీసెంట్ గా పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు అతని వైఫ్ ఎంట్రీ ఇచ్చారు. "మీ ఇద్దరూ కలిసొచ్చారు మాకు చాలా ఆనందం" అని ప్రదీప్ అనేసరికి "ఏటో వెళ్ళిపోతున్న నా లైఫ్ ని ప్రదీప్ అన్న కలిపాడు..అందుకే నాకు కొడుకు పుడతాడు కదా అతనికి ప్రదీప్ అన్న పేరే పెట్టుకుంటా " అని ఫన్నీగా చెప్పాడు యాదమ్మ రాజు. ఇక ఈ షోకి నూకరాజు, పంచ్ ప్రసాద్ కూడా వచ్చారు. "ఎల్కమ్ ఎల్కమ్" అని ప్రదీప్ ఇన్వైట్ చేసేసరికి "మేము ఎలకలం కాదు ఆర్టిస్టులం" అని పంచ్ వేసాడు ప్రసాద్. "నీ లైఫ్ లో గోల్డెన్ డేస్ ఏవి అని అడిగితే ఏం చెప్తావ్ " అని ప్రదీప్ యాదమ్మ రాజు అడిగాడు. " నా బేబీ నా లైఫ్ లోకి రావడమే గోల్డెన్ డేస్ అని చెప్పాలి లేదంటే ఇంటి పోయినాక నాకు ఉంటాయ్ " అన్నాడు కమెడియన్ యాదమ్మ రాజు. "నూకరాజు కాంతారా పెర్ఫార్మెన్స్ చూసాక ఏమనిపించింది" అని ప్రదీప్ పంచ్ ప్రసాద్ ని అడిగాడు. "నూకరాజు శివపుత్రుడు పెర్ఫార్మెన్స్ చేసి దాన్ని కాంతారా" అన్నాడు అని కౌంటర్ వేసాడు ప్రసాద్. చివర్లో మస్కిటో కాయిల్ చూపించి " ఈ దోమల బత్తి నువ్వైతే నీ చుట్టూ తిరిగే దోమను నేను.. ఈ దోమల బత్తి నువ్వైతే దాన్ని వెలిగించే అగ్గిపెట్టె నేను" అంటూ యాదమ్మ రాజు తన వైఫ్ కి వెరైటీ గా ప్రొపోజ్ చేసాడు.